Location Icon
9266125888

BPPV

divider
banner-divider

కారణాలు

ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే  చాలా మంది రోగులలో తల తిరగడం అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. దీనిని ప్రాథమిక BPPV అంటారు. అయినప్పటికీ, క్రింద పేర్కొన్న కొన్ని పరిస్థితులు BPPV ప్రమాదాన్ని పెంచుతాయి:

  • తలకు గాయం కావడం వలన
  • ఎక్కువ సమయంపాటు  పడుకుని విశ్రాంతి తీసుకోవటం వలన
  • చెవిలో ఇన్ఫెక్షన్ల వలన
  • ఆపరేషన్ చేయించుకున్న తర్వాత
  •  మైగ్రేన్ వలన

వయసు పెరిగే కొద్దీ BPPV వచ్చే అవకాశం పెరుగుతుంది. విటమిన్ డి లోపం కూడా BPPV వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

A vector image of women suffering from bppv
Divider border Icon
divider Border icon

లక్షణాలు

  • మైకం కమ్మడం లేదా తల తిరగడం  అనేది సాధారణంగా మంచం మీద ఒక ప్రక్కకు తిరగడం లేదా క్రిందికి వంగడం వంటి స్థితిని మార్చడం ద్వారా వస్తుంది
  • నిలకడ లేకపోవడం లేదా సరిగా నిలబడ లేకపోవడం
  • వికారంగా ఉండడం లేదా వాంతులు అవ్వడం 

తల తిరిగడం వంటి సందర్భాలు సాధారణంగా ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఉన్నప్పటికీ, రోగులు నిలబడ లేనట్లుగా లేదా తల భారంగా భావించవచ్చు.

Divider icon
divider icon

వ్యాధి నిర్ధారణ

VNG మార్గదర్శకత్వంలో, డిక్స్-హాల్‌పైక్ మరియు సుపైన్ రోల్ పరీక్షలు వంటి కొన్ని నిర్దిష్ట స్థాన పరీక్షలు BPPVని నిర్ధారించడానికి మరియు స్థానభ్రంశం చెందిన స్ఫటికాల స్థానాన్ని గుర్తించడానికి నిర్వహించబడతాయి. BPPV అనేది వెస్టిబ్యులర్ న్యూరిటిస్, మెనియర్స్ డిసీజ్, వెస్టిబ్యులర్ మైగ్రేన్ లాంటి మొదలైన మైకము కలిగించే ఇతర వెస్టిబ్యులర్ సమస్యలతో కలిసి ఉండవచ్చు. అందువల్ల క్షుణ్ణమైన వెస్టిబ్యులర్ మూల్యాంకనం సిఫార్సు చేయబడింది.

MRI లేదా CT స్కాన్‌లు BPPVని నిర్ధారించటంలో సహాయపడవు.

Pattern border

BPPV యొక్క చికిత్స

తిరిగి స్థాపించే విధానాలు:

BPPV అనేది కాల్షియం కార్బోనేట్ స్ఫటికాల స్థానభ్రంశం వలన ఏర్పడే లోపలి చెవి యొక్క యాంత్రిక రుగ్మత. చికిత్సలో ఈ స్ఫటికాలను యుట్రికిల్‌లో వాటి అసలు స్థానానికి తిరిగి మార్చడం అనేది జరుగుతుంది. BPPV యొక్క చికిత్స కోసం వివిధ రకములైన తిరిగి స్థాపించే నైపుణ్య విధానాలు వివరించబడ్డాయి. కొన్ని సాధారణ నైపుణ్య విధానాలు క్రింద పేర్కొనబడ్డాయి:

  • ఎప్లీ యొక్క నైపుణ్య విధానం
  • సెమోంట్ యొక్క నైపుణ్య విధానం
  • బార్బెక్యూ నైపుణ్య విధానం
  • జుమా నైపుణ్య విధానం
  • గుఫోని నైపుణ్య విధానం

BPPVని కలిగిన చాలా మంది రోగులకు సరిగ్గా వాడిన నైపుణ్య విధానం ఉపశమనాన్ని అందిస్తుంది.

చికిత్స తర్వాత తీసుకోవలసిన సంరక్షణ చర్యలు

తిరిగి స్థాపించే నైపుణ్య విధానం తర్వాత,  స్థానభ్రంశం చెందిన అన్ని స్ఫటికాలు తిరిగి స్థాపించబడ్డాయని నిర్ధారించుకోవడానికి తదుపరి సందర్శన కోసం రావాలని రోగిని కోరతారు. కొంతమంది రోగులకు అదనపు నైపుణ్య విధానాలు అవసరం కావచ్చు. కొంతమంది రోగులు BPPV చికిత్స తర్వాత మైకమును అనుభవిస్తారు, దీనిని వెస్టిబ్యులర్ రిహాబిలిటేషన్‌తో చికిత్స చేయవచ్చు.

Nationwide care with 200+ clinics in 54+ cities.

Visit a NeuroEquilibrium Clinic today!

footer-divider icon
divider
Englishहिन्दी

Book an Appointment for Vertigo profile test