Location Icon
9266125888

మెనియర్స్ వ్యాధి

divider
banner-divider

వ్యాధి గురించి వివరణ

a vector image of women suffering from Menieres Disease

మెనియర్స్ వ్యాధి అనేది లోపలి చెవి ద్రవం యొక్క హెచ్చుతగ్గుల ఒత్తిడి వల్ల ఏర్పడే దీర్ఘకాలిక వెస్టిబ్యులర్ రుగ్మత. ఇది ఒక చెవిలో హెచ్చుతగ్గుల వినికిడి లోపంతో తిరిగి వస్తూ వుండే తల తిరుగుడు సందర్భాలతో ఉంటుంది. ఇది నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి, దీని వలన కలిగే దీర్ఘకాలిక సమస్యలను నివారించడానికి వీలైనంత త్వరగా చికిత్స చేయాలి. పెరిగిన ద్రవ ఒత్తిడి వలన లోపలి చెవి బెలూన్ లాగా విస్తరించడానికి కారణమవుతుంది, తద్వారా ఇది వెర్టిగో, వినికిడి లోపం, చెవిలో రింగింగ్ శబ్దం (టిన్నిటస్) యొక్క తిరిగి వస్తూ వుండే సందర్భాలకు దారితీస్తుంది. మెనియర్స్ వ్యాధి ఏ వయసులోనైనా అభివృద్ధి చెందుతుంది, కానీ ఇది 30-60 సంవత్సరాల వయస్సు గల వారిలో సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది.

Divider border Icon
divider Border icon

లక్షణాలు

  1. వెర్టిగో: మెనియర్స్ వ్యాధిలో అత్యంత ఇబ్బందికరమైన ఫిర్యాదు ఏమిటంటే ఊహించలేని విధంగా తిరిగి వస్తూ ఉండే  వెర్టిగో సందర్భాలు, ఇది దాదాపు 20 నిమిషాల నుండి చాలా గంటల వరకు ఉంటుంది. వెర్టిగో దాడులు తరచుగా వికారం మరియు వాంతులతో కూడి ఉంటాయి.
  2. వినికిడి లోపం: ఒక చెవిలో హెచ్చుతగ్గుల వినికిడి లోపం మెనియర్స్ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలలో ఒకటి. వ్యాధి పెరిగేకొద్దీ, తాత్కాలిక వినికిడి లోపం శాశ్వత వైకల్యంగా మారవచ్చు.
  3. టిన్నిటస్ (చెవిలో మోగడం): టిన్నిటస్ అనేది చెవిలో మోగుతున్న లేదా సందడి చేసే శబ్దం. ప్రారంభ దశల్లో, శబ్దం వచ్చి పోవచ్చు, కానీ వ్యాధి పెరగడంతో శబ్దం రావడం అనేది స్థిరమైన లక్షణంగా మారవచ్చు.
  4. చెవిలో నిండుదనం: మెనియర్స్ వ్యాధితో బాధపడుతున్న రోగులు వెర్టిగో యొక్క సందర్భ కాలంలో ప్రారంభమయ్యే ముందు తరచుగా ప్రభావిత చెవిలో (శ్రవణ నిండుదనమును) లేదా వారి తల వైపు ఒత్తిడిని అనుభవిస్తారు. వెర్టిగో యొక్క సందర్భ కాలం తగ్గిన తర్వాత ఈ అనుభూతి తగ్గవచ్చు.
Divider icon
divider icon

వ్యాధి నిర్ధారణ

వెస్టిబ్యులర్ మూల్యాంకనమును  మరియు ఆడియోమెట్రీని క్షుణ్ణంగా అనుసరించిన తరువాత  వివరణాత్మక చరిత్రను సేకరించటం వలన  వైద్యుడు వ్యాధి నిర్ధారణను మరియు దశను తెలుసుకోవడానికి సహాయమవుతుంది. పరీక్ష ఫలితాల ప్రకారం, చికిత్స ప్రణాళిక చేయబడింది.

Pattern border

చికిత్స

మెనియర్స్ వ్యాధికి చికిత్స అనేది వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం పొందడం, లోపలి చెవి ఒత్తిడిని తగ్గించడం మరియు వ్యాధి పురోగతిని నివారించడంపై దృష్టి పెడుతుంది.

ఇది వివిధ చర్యల ద్వారా సాధించబడుతుంది –

ఆహారంలో మార్పులు.

దీని కోసం ఉద్దేశించబడిన మందులు :

వెర్టిగో దాడిని నియంత్రించడం

లోపలి చెవి ఒత్తిడిని తగ్గించడం

వ్యాధి యొక్క పాథాలజీకి చికిత్స చేయడం

వెస్టిబ్యులర్ పునర్వ్యవస్థీకరణ చికిత్స: తీవ్రమైన లక్షణాలు నియంత్రించబడిన తర్వాత, రోగికి అనుకూలీకరించిన వెస్టిబ్యులర్ పునర్వ్యవస్థీకరణ  చికిత్సతో సహాయం చేయవచ్చు.

ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్లు: వైద్య నిర్వహణకు బాగా స్పందించని రోగులలో, మేము స్టెరాయిడ్స్ మరియు జెంటామిసిన్ రూపంలో ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్లను అందిస్తాము. ఇవి శారీరక చెడు  ప్రభావాలు లేకుండా చెవిలో స్థానికంగా అధిక సాంద్రత కలిగిన ఔషధాన్ని అందించడం ద్వారా లోపలి చెవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

వినికిడి పరికరాలు: వినికిడి లోపం స్థిరంగా మారినప్పుడు మరియు రోగి యొక్క రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసినప్పుడు, వినికిడి ఫలితాలను మెరుగుపరచడానికి వినికిడి పరికరాలను ఉపయోగించవచ్చు.

శస్త్రచికిత్స: మెనియర్స్ వ్యాధిలో శస్త్రచికిత్స చాలా అరుదుగా సూచించబడుతుంది. వెర్టిగో సందర్భాలు తీవ్రంగా మరియు తరచుగా ఉన్నప్పుడు ఎంతకూ తగ్గని మెనియర్స్ వ్యాధికి చికిత్స చేయడానికి ఇది చివరి ఎంపికలలో ఒకటిగా మిగిలిపోయింది.

Nationwide care with 200+ clinics in 54+ cities.

Visit a NeuroEquilibrium Clinic today!

footer-divider icon
divider
Englishहिन्दी