వెస్టిబ్యులర్ ఎవోక్డ్ మయోజెనిక్ పొటెన్షియల్ (cVEMP) పరీక్ష, అధిక-స్థాయి ధ్వని ఉద్దీపనలకు తక్కువ-కాల వ్యవధి గల EMG పొటెన్షియల్ ప్రేరేపిత ప్రతిస్పందనలను కొలవడం ద్వారా ఓటోలిత్ మరియు వెస్టిబ్యులర్ నాడి పనితీరును అంచనా వేస్తుంది. ఇది వివిధ రకాల వెస్టిబ్యులర్ రుగ్మతలను నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన సాధనం.
ఓటోలిత్ మరియు వెస్టిబ్యులర్ నాడి పనితీరు: ఓటోలిత్ అవయవాలు మరియు వెస్టిబ్యులర్ నాడి యొక్క పనితీరును అంచనా వేస్తుంది.
రోగ నిర్ధారణ సాధనం: వెస్టిబ్యులర్ న్యూరైటిస్, సుపీరియర్ సెమీ-సర్క్యులర్ కెనాల్ డెహిసెన్స్ (SSCD), మెనియర్స్ వ్యాధి, మరియు డీమైలినేటింగ్ రుగ్మతలు వంటి పరిస్థితులను నిర్ధారించడంలో సహాయపడుతుంది.
ఉద్దీపన లేదా ప్రేరకం: గాలి ద్వారా ప్రసరించే ఇయర్ఫోన్ల ద్వారా అందించబడే క్లిక్‌లు.
ధ్వని తీవ్రత: 90 dB nHL
ఉద్దీపన లేదా ప్రేరకం పౌనఃపున్యం: 1 హెర్ట్జ్
స్వయంచాలిత గణనలు:
స్వయంచాలిత cVEMP నిష్పత్తి గణన
P1 కాల వ్యవధి యొక్క అంతరశ్రవణ వ్యత్యాసం, N1 కాల వ్యవధి యొక్క అంతరశ్రవణ వ్యత్యాసం, P1-N1 అంతర వ్యాప్తి యొక్క అంతరశ్రవణ వ్యత్యాసం, పార్శ్వ నిష్పత్తి L/R, అసౌష్టవ నిష్పత్తి (%) ల గణన
న్యూరోఈక్విలిబ్రియం cVEMP అనేది, ఓటోలిత్ మరియు వెస్టిబ్యులర్ నాడి పనితీరును అంచనా వేయడానికి ఒక కచ్చితమైన మరియు సమర్థవంతమైన పద్ధతిని అందిస్తుంది, ఇది వివిధ రకాల వెస్టిబ్యులర్ రుగ్మతల నిర్ధారణలో మరియు వాటి నిర్వహణలో సహాయపడుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
cVEMP పరీక్ష అంటే ఏమిటి?
cVEMP (సెర్వికల్ వెస్టిబ్యులర్ ఎవోక్డ్ మయోజెనిక్ పొటెన్షియల్) పరీక్ష అనేది లోపలి చెవిలోని సాక్యుల్ అనే సమతుల్యత అవయవం మరియు ఇన్ఫీరియర్ వెస్టిబ్యులర్ నాడి యొక్క పనితీరులను అంచనా వేయడానికి ఉపయోగించే ఒక రోగనిర్ధారణ పరీక్ష. చెవికి ధ్వని ఉద్దీపనలను అందించినప్పుడు ఇది మెడలోని రిఫ్లెక్స్ కండరాల ప్రతిస్పందనలను కొలుస్తుంది, తద్వారా మైకం కమ్మడం, వెర్టిగో(తల తిరగడం) మరియు సమతుల్యత రుగ్మతల(లోపాల)కు గల కొన్ని కారణాలను అంచనా వేయడంలో సహాయపడుతుంది.
VEMP పరీక్ష మీకు ఏమి తెలియజేస్తుంది?
లోపలి చెవిలోని నిర్దిష్ట సమతుల్య అవయవాలు మరియు వాటి నాడీ మార్గాలు ఎంత బాగా పనిచేస్తున్నాయనే దాని గురించి సమాచారాన్ని VEMP పరీక్ష అందిస్తుంది. ఇది గురుత్వాకర్షణ మరియు సరళరేఖాకార కదలికలను గ్రహించే బాధ్యత కలిగిన ఓటోలిత్ అవయవాలను ప్రభావితం చేసే వెస్టిబ్యులర్ రుగ్మతల(లోపాల)ను గుర్తించడంలో సహాయపడుతుంది. న్యూరోఈక్విలిబ్రియం వంటి ప్రత్యేక కేంద్రాలలో, VEMP పరీక్ష సంక్లిష్టమైన సమతుల్య పరిస్థితుల యొక్క ఖచ్చితమైన నిర్ధారణకు మద్దతును అందిస్తుంది.
cVEMP యొక్క సాధారణ విలువ ఎంత?
సాధారణ cVEMP ఫలితాలు అనేవి సాధారణంగా మెడకు ఇరువైపులా గల స్పష్టమైన, సమరూప కండరాల ప్రతిస్పందనను, ఆశించిన తరంగరూప నమూనాలతో మరియు కాల వ్యవధి(జాప్య) విలువలతో చూపిస్తాయి. ఖచ్చితమైన సంఖ్యా పరిధులు అనేవి పరికరాలను మరియు వయస్సును బట్టి మారవచ్చు, కానీ ఆరోగ్యకరమైన ప్రతిస్పందన సాధారణ శాక్యులార్ మరియు ఇన్ఫీరియర్ వెస్టిబ్యులార్ నాడి పనితీరును సూచిస్తుంది. ప్రతిస్పందనలు తగ్గడం, ఆలస్యమవ్వడం(జాప్యమవ్వడం), లేదా లేకపోవడం అనేది వెస్టిబ్యులార్ పనిచేయకపోవడాన్ని సూచించవచ్చు.
VEMP మరియు cVEMP మధ్య గల తేడా ఏమిటి?
VEMP అనేది ధ్వని లేదా కంపనానికి కండరాల ప్రతిస్పందనలను ఉపయోగించి ఓటోలిత్ అవయవ పనితీరును అంచనా వేసే పరీక్షలకు వాడే ఒక సాధారణ పదం. cVEMP అనేది ప్రత్యేకంగా మెడ కండరాల నుండి వచ్చే ప్రతిస్పందనలను కొలుస్తుంది మరియు శాక్యుల్, ఇన్ఫీరియర్ వెస్టిబ్యులర్ నాడి పనితీరును ప్రతిబింబిస్తుంది, అయితే oVEMP అనేది కంటి కండరాలను అంచనా వేస్తుంది మరియు యుట్రికల్ పనితీరుకు సంబంధించినది. న్యూరోఈక్విలిబ్రియం వంటి క్లినిక్‌లు సమగ్ర మూల్యాంకనం కోసం తరచుగా ఈ రెండింటినీ ఉపయోగిస్తాయి.
cVEMP పరీక్షను ఎలా నిర్వహించాలి?
cVEMP పరీక్షను నిర్వహించడానికి, మెడ మరియు కాలర్‌బోన్ ప్రాంతంలో ఉపరితల ఎలక్ట్రోడ్లను ఉంచుతారు. ఇయర్ఫోన్ల ద్వారా ధ్వని ఉద్దీపనలను అందిస్తున్నప్పుడు, రోగి మెడ కండరాలను ఉత్తేజపరిచేందుకు తన తలను తిప్పుతాడు లేదా పైకి ఎత్తుతాడు. కండరాల ప్రతిస్పందనలను రికార్డ్ చేసి, విశ్లేషిస్తారు. ఈ పరీక్ష శస్త్రచికిత్స అవసరం లేనటువంటిది, అలాగే క్లుప్తమైనది మరియు ఇది పెద్ద శబ్దాలకు కారణం కావచ్చు, కానీ సాధారణంగా దీనిని బాగా తట్టుకోగలుగుతారు.
వెర్టిగో(తల తిరగడం), తలనొప్పులు కలగడం, వికారంగా ఉండటం, లేదా చెవుల్లో రింగుమని శబ్దం వంటి సమస్యలు ఉన్నాయా? వాటి మూల కారణాన్ని కనుక్కోండి. నిపుణుడితో మాట్లాడండి.